మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో ఛైర్మన్ అయ్యింది అంటూ చిరంజీవి… ” గౌరవనీయమైన పదవికి ఉపాసన కొణిదెల నియామకం పట్ల ఆనందంగా ఉంది. ఇది ఒక గౌరవం, గొప్ప బాధ్యత కూడా. డియర్ ఉపాసన.. మీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలను రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీకు ఆ దేవుడు అశీసులు తోడుగా ఉంటాయి” అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.

