పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే బెంగాల్ లోని ఫాల్తా నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. దాంతో అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మే 21 న ఫాల్తా నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈవీఎంలపై కొన్ని పార్టీల గుర్తులకు టేపులు వేయడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం అలాగే ఓటర్లను ప్రలోభపెట్టినట్లు 77 ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది.

