జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్‌పై రెవెన్యూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్లు, సర్పంచులు, హెడ్మాస్టర్లు, మ్యారేజ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డులు, ఎస్‌ఎస్‌సీ మెమోలు, తదితర నకిలీ ధ్రువ పత్రాలకు సంబంధించిన ముద్రలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్‌లో సుమారు 150 పైగా వివిధ పత్రాలు నకిలీవి తయారు చేసినట్టు గుర్తించారు.

