నీట్ 2026 పరీక్ష మే 3, ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.00 నుంచి 5.20 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోపు హాజరుకావాలి. పురుషులు క్యాజువల్ ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్ మాత్రమే ధరించాలి, చెప్పులు మాత్రమే అనుమతి. విద్యార్థినులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు, సింపుల్ చెప్పులు ధరించాలి. మెహింది, హ్యాండ్‌బ్యాగులు, పర్సులు నిషేధం. హాల్ టిక్కెట్, ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు తప్పనిసరి. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు.

