విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై విచారణ అనంతరం ప్రొఫెసర్ దేవదత్ మౌళీనాయక్, ల్యాబ్ టెక్నీషియన్ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేసింది. విద్యార్థినుల ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్, మరో అధ్యాపకురాలిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

