బిగ్బాస్ సీజన్-9 ప్రస్తుతం మాంచి ఊపులో ఉంది. మరో రెండు వారాల్లో ఫినాలేలోకి అడుగుపెడుతుండటంతో క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బిగ్బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకి టీవీలో ప్రసారమవుతోంది. అయితే డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. వీకెండ్ ఎపిసోడ్ టైమింగ్స్ మారలేదు. అంటే సోమవారం- శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, వీకెండ్ ఎపిసోడ్స్ రాత్రి 9 గంటలకే ప్రసారం అవుతాయి. స్టార్ మా ఛానెల్లో ప్లే కాబోతున్న కొత్త సీరియల్ కోసం షో టైమింగ్ మార్చేశారట!

