బిఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు…ఒక విప్లవం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేతలు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా అని, పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం అని పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం…25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని పేర్కొన్నారు.

