ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు.. షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది గత ఏడాది జులై – ఆగస్టులో విద్యార్థుల నిరసనల అణచివేత సమయంలో దాదాపు 1400 మంది మృతిచెందారని ఐసీటీ న్యాయమూర్తి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని చంపేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు.

