విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ‘‘కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజుది. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి నుంచి మరోలెక్క. విశాఖ ముఖచిత్రం ఈరోజు నుంచే మారబోతోంది. ఇప్పటి నుంచి విశాఖను డేటా ఏఐ హబ్‌గా పిలుచుకోబోతున్నాం. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతోంది’’ అని లోకేశ్ అన్నారు

