టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంఖుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. భారతదేశానికి ఏపీ.. అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందన్నారు. గూగుల్ రాక.. ఏపీకి గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు. సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. ఇప్పుడు భారత గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోందన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు.

