ఏపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి తప్పించు కోవడానికి చంద్రబాబు బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టుబడ్డవారు మీతోనూ, నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారేని ఆరోపించారు.

