loader

జానీ మాస్టర్‌కు…. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్..

సింగర్ చిన్మయి ఒక సంచలన ట్వీట్ పెట్టింది. జానీతో పాటు మరో ప్రముఖ సింగర్ కార్తీక్ పై కూడా తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుంది. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టవద్దు. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా […]

మత్స్యకారులతో కలిసి రాహుల్ గాంధీ చేపల వేట..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం బెగుసరాయ్‌ జిల్లాలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ .. రాహుల్‌ గాంధీ బోటులో ఓ చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకు తన ఒంటిపై దుస్తులు విపి, బనియన్, షాట్‌తో ముకేశ్‌ సాహ్నీ చెరువులోకి దిగారు. స్థానిక మత్స్యకారులతో చేపలను వేటాడారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది.

ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి !

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలోని మటోడా ప్రాంతంలో ఆదివారం (నవంబర్ 2)న ఆగివున్న ట్రక్కును ట్రావెలర్ టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బికనీర్‌లోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లారు. దైవ దర్శనానంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఢీకొన్న వెంటనే వాహనం నుంచి దట్టమైన మంటలు ఎగిసిపడ్డాయి.

వరల్డ్ కప్ ఫైనల్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ…

ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి వెళ్లారు. లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సచిన్‌తో దిగిన ఫొటోలను కూడా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టీమిండియా భారీ స్కోరు.. షెఫాలీ, దీప్తి ఫిఫ్టీలు

సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న మ‌హిళా వన్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ కు దిగిన భార‌త్.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 298 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ సూప‌ర్బ్ ఫిఫ్టీ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. మ‌హిళా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్లో ఒక జ‌ట్టు ఛేజ్ చేసిన అత్య‌ధిక స్కోరు కేవ‌లం 167 ప‌రుగులే […]

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్‌లో స్మృతి 418 […]

కాశీబుగ్గ ఆలయం మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేత.

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తాజాగా పరిహారం అందజేసింది. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు,రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. గాయపడి చికిత్స అనంతరం కోలుకున్న వారిని ఇళ్లకు పంపుతున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌ ఒక్కసారిగా కురిసిన వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు..!

హైదరాబాద్‌లోని ఆదివారం సాయంత్రం పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌, బహదూర్‌పల్లి, సూరారం, షాపూర్‌నగర్‌, జీడిమెట్ల, బాలానగర్‌, జగద్గిరిగుట్ట, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్‌, సుచిత్రలో వానపడింది. అమీర్‌పేట, ఎర్రగడ్డ, కృష్ణానగర్‌, మధురానగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌తో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడింది. వర్షంతో ఒక్కసారిగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

చరిత్ర సృష్టించిన ISRO.. బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్..

ISRO 4,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం భారత్ భూస్థిర బదిలీ కక్ష్య (GTO)లోకి ప్రవేశపెట్టే అత్యంత భారీ ఉపగ్రహం అని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. 4,000 కిలోల వరకు బరువును మోసుకెళ్లే సామర్థ్యం కారణంగా శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టారు. ప్రయోగించిన రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో చైర్మన్‌ వీ […]

లండన్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం దంపతులు లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాలు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు ఘన స్వాగతం పలికారు. నవంబర్ 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి రెండు అవార్డులను నారా భువనేశ్వరి అందుకోనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON