ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన హస్తం పార్టీ, అధికారం దక్కించుకున్న తర్వాత ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్నదని ధ్వజమెత్తారు. నాడు ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు.

