బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా అమానుష చర్యలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వేళ హసీనా తాజాగా స్పందించారు.
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన రోపణలను హసీనా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడు అంటూ ఆరోపించారు. యూనస్ అధికారాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. హంతకులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందన్నారు.

