సిట్ అధికారులు నందినగర్‌లోని తన ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి ఆయన లేఖ రాశారు. సిట్ నోటీసులు ఇవ్వడంలో కనీస నిబంధనలను పాటించలేదుఅని చెప్పుకొచ్చారు. చట్టపరమైన అభ్యంతరాలున్నా తాను విచారణలో సిట్‌కు సహకరిస్తానని … అయితే గోడలకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదు అని లేఖలో అభిప్రాయపడ్డారు. సిట్ పోలీసుల వైఖరి కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని… అంతేకాదు పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని లేఖలో వెల్లడించారు.

