నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటూ విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటానన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉందని నిరూపించాలని చంద్రబాబు, లోకేష్ కు గతంలోనే జోగి రమేష్ విసిరారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

