చైనాలోని నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా… వరద పోటెత్తుతుంది. ముఖ్యంగా యాన్ , మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ మీడియా ప్రకారం ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతింది. గ్రామంలో డజన్ల కొద్దీ ఇళ్ళు కూలిపోయాయి. చాలా మంది వరద నీటిలో కొట్టుకుని పోయారు.. ఇప్పటికీ వారి జాడ కనిపించలేదు.

