థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య కొనసాగుతన్న ఘర్షణకు తెరపడింది.కంబోడియా, థాయ్‌లాండ్‌ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అంతేకాకుండా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొన్న ఇరుదేశాల నాయకులు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివాదాస్పద 800 కి.మీ సరిహద్దులో ఇరువైపులా 35 మంది మరణించగా, 2,60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు
థాయ్‌లాండ్, కంబోడియాలు వాటి మధ్య ఘర్షణను ఆపడానికి అంగీకరించకపోతే… ఇరుదేశాలతో అమెరికా వాణిజ్య చర్చలు నిలిపివేయబడతాయని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

