ట్రంప్ దెబ్బకు అల్లాడిపోయిన రొయ్యల రైతులకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాల అమలును వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు మళ్లీ ఊపిరి వచ్చింది. మొన్నటి వరకు లిచిపోయిన రొయ్యల కంటైనర్లు మళ్లీ అమెరికాకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నాయి.. దీంతో గోదాముల్లో నిల్వలు తగ్గుతున్నాయి. సుంకాల అమలుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో వాటిని అమెరికాకు ఎగుమతి చేయడానికి ద్ధమయ్యారు వ్యాపారులు. ఏపీ ప్రభుత్వం రొయ్యల ధరలపై ఏర్పాటు చేసిన ఆక్వా సలహా కమిటీ సోమవారం వర్చువల్ ద్వారా సమావేశమైంది.

