ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది.

