టీవీకే పార్టీ రాకతో తమిళనాడులో రాజకీయ వాతావరణం మారిందని అధినేత విజయ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించి సోమవారంతో రెండేళ్లు పూర్తి చేస్తుకున్న
సందర్భంగా విజయ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సవాళ్లు ఎదురైనా టీవీకే స్థిరంగా ఉందని, సామాన్య ప్రజలకు సాధికారత కల్పించే రాజకీయాల కోసం దీనిని ఒక ఉద్యమంగా అభివర్ణించారు. పాలనా పగ్గాలను చేజిక్కించుకునే ప్రజాస్వామ్య లక్ష్యాన్ని మనం దృఢంగా సాధిస్తాం’ అని విజయ్ ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

