భారత్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ చేపట్టింది.ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ అంతట కూడా జల్లెడ పడుతున్నారు. జమ్ములోని దాచిగామ్ అడవుల్లో ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. వెంటనే మూకుమ్మడిగా చుట్టుముట్టి.. ఉగ్రవాదులపై కాల్పులతో తెగ బడ్డాయి. ముగ్గురు టెర్రరిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ముఖ్యంగా వీరు పహల్గంలో అమాయకుల టూరిస్టుల ప్రాణాలు బలితీసుకున్న వారు కావడంతో.. భద్రత ధళాలు వీరిపై మరింతగా తమ తడాఖా చూపించాయి.

