ఎట్టి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. డీలిమిటేషన్ కోసం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు మాత్రం దీర్ఘకాలం అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపుతూ ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేపట్టడం సహేతుకమైనది కాదన్నారు. కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే కాకుండా, ఇతర నమూనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

