ఆస్ట్రేలియాలో 33 సంవత్సరాల భారతీయ సంతతి వ్యక్తి సౌరభ్ ఆనంద్‌పై దుండగులు దాడి జరిపారు. ఈ ఘటనలో ఆయన చేయి పూర్తిగా తెగిపోయింది. చికిత్స జరిపిన వైద్యులు దీనిని అతికించారు. గతవారం సౌరభ్‌పై దాడి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ మెడికల్ షాప్ నుంచి ఇంటికి వెళ్లుతున్న ఆనంద్‌ను దుండగులు అటకాయించారు. తమ చేతుల్లో ఉన్న పొడవాటి కత్తితో దాడికి దిగారు.ఈ క్రమంలో ఆయన చేయి తెగిందని వెల్లడైంది.

