హమాస్ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ దాడులకు తెగబడింది. నాజర్ ఆస్పత్రిపై సోమవారం జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నిలిస్టులు సహా కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో ఒకరు రాయిటర్స్కు చెందిన హతేమ్ ఖలీద్, ఓ ఫొటోగ్రాఫర్ అని స్థానిక వార్తా సంస్థ తెలిపింది.

