ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో వినతిపత్రం సమర్పించారు పవన్. పీఎం గతి శక్తి పథకం కింద పిఠాపురం పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డుపై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరిన పవన్..

