ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. బంకులకు డీజిల్ సరఫరాను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. క్రెడిట్ సౌకర్యం రద్దు చేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో డీజిల్ కొరత నెలకొంది. గోదావరి జిల్లాలో డీజిల్ కొరతతో వరికోతలు నిలిచిపోతున్నాయి. మరోవైపు ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపల సాగుపై ప్రభావం పడుతోంది.

