రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జాతీయ ఉద్యమం కోసం వైఎస్ జగన్తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకుని వైసీపీ నాయకులపై మూడ్రోజులుగా దుర్మార్గానికి పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి ఇళ్లు దహనం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోలు బాంబులు వేయడం దౌర్జన్య పాలనకు పరాకాష్ట అని విమర్శించారు.

