కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తులతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలో తరించారు.
కార్తిక పౌర్ణమి వేళ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచారామాల్లో ఒకటైన అమరావతి బాల చాముండీ సహిత అమరలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి.

