రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మూడు రోజుల సమావేశం చివరి రోజున, RSS చీఫ్ మోహన్ భగవత్ అనేక ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 75 ఏళ్లు నిండిన వారు పదవి విరమణ చేయాలన్న నిబంధనలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోసిపుచ్చారు. “నేను పదవీ విరమణ చేస్తానని గానీ 75 ఏళ్లు నిండినప్పుడు మరొకరు పదవీ విరమణ చేయాలని గానీ నేను ఎప్పుడూ చెప్పలేదు..” అని స్పష్టం చేశారు.

