తాను ప్రయాణించే విమాన కార్యకలాపాల్లో అంతరాయం కలిగించడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకోసం విమానాశ్రయాల్లో తమకు అనుకూలంగా సిబ్బందిని నియమించుకున్నారని విమర్శించారు. అంతేకాదు తన విమానాన్ని రన్‌వేపై 30 నిమిషాల పాటు నిలిపి ఉంచారని, ఈ చేదు అనుభవం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఎదురైందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవడానికి ఏఐటీసీ(ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్) కార్యకర్తలపై తప్పడు కేసులు బనాయిస్తున్నారని మమతా ఆరోపించారు. గంజాయి కేసులు పెట్టి వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.