ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ ఇవాళ రాజమహేంద్రవరం కోర్టుకు హాజరయ్యారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు ..సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్ట్ చేసారు. ఆ తరువాత అనంతబాబును కాకినాడకు తరలించారు.

