మెగా ఇంటి కోడలు.. రాం చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేసారు. సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్గా నియమించింది.

