ఆఫ్రికా దేశం ఉగాండా ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక మంది పురుషులు తమ పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు.. అందులో 98 శాతం మందికి, ఆ పిల్లలకు తాము తండ్రులం కాదని తెలిసి షాక్కు గురవుతున్నారు. పురుషుల్లో సంతాన సమస్య వున్నా, మహిళ సంతానం ఇవ్వడంలో విఫలమైతే, విడాకులు లేదా బహిష్కరణ వంటి ఆఫ్రికన్ సంప్రదాయాల కారణంగా మహిళలు వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి ఇతరుల ద్వారా పిల్లలను కనడానికి మొగ్గు చూపుతున్నారని ఒక అధికారి తెలిపారు.

