వికలాంగులను లక్ష్యంగా చేసుకుని “సున్నితత్వం లేని జోకులు” వేస్తూ హాస్యం చేసినందుకు సోమవారం సుప్రీంకోర్టు హాస్యనటులపై తీవ్రంగా మండిపడింది. వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని,
వారికి జరిమానాలు కూడా విధించాలని కోర్టు ఆదేశించింది. హాస్యనటులు సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ తమ స్టాండ్-అప్ కంటెంట్‌లో వికలాంగులను ఎగతాళి చేశారని పిటిషన్లో ఆరోపించారు.

