ఇరాన్ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టైన 800 మందికి విధించాల్సిన ఉరిశిక్షలను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని తాను ఎంతో గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

