ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది. తగిన ఆధారాలను సమర్పించడంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విఫలమైందని తెలిపిన కోర్టు కేసును కొట్టివేసింది. దాంతో, కొన్నాళ్లుగా అవినీతి కేసులో జైలు పాలైన ఆయనకు విముక్తి దొరికింది.

