సీఎం చంద్రబాబును బూతులు తిట్టిన వైసీపీ లీడర్ అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ నేతను బూతులు తిట్టిన అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. తాము తలచుకుంటే వైసీపీ నేతలు గుంటూరులో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. అసలు గుంటూరులో వైసీపీ ఆఫీసే లేకుండా చేస్తామని అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు 24 గంటల్లో అంబటి క్షమాపణలు చెప్పకపోతే ఆయన్ని గుంటూరులో తిరగకుండా చేస్తామని చెప్పారు.

