UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ సెషన్ పరీక్షల సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ను NTA విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు, అలాగే డిసెంబర్ 21న పరీక్షలు నిర్వహించనున్నారు మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇతర వివరాలను పరీక్షకు 21 రోజుల ముందుగా NTA అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.