ఆంధ్రప్రదేశ్లో అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగిస్తోంది.