అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ త్రైపాక్షిక భేటీని ఒక మైలురాయి ఘట్టంగా అభివర్ణించారు షీ జిన్పింగ్. మూడు దేశాల మధ్య సహకారం కోసం ఆయన రెండో ప్రపంచ యుద్ధం నాటి కూటమిని ప్రస్తావించారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో చైనా, రష్యా, అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాలను ఉమ్మడిగా కాపాడుతూ మానవ పురోగతికి మరింత కృషి చేయాలని కోరారు.