SIR ఓట్ల గల్లంతు ప్రభావం రెండు ప్రధాన పార్టీలపై పడే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ సొంత ఊళ్లకు వచ్చి ఓటేసే మైగ్రెంట్ ఓటర్లు వైఎస్సార్‌సీపీ లేదా టీడీపీ మద్దతుదారులనే లెక్కలు పార్టీల వద్ద ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తమ మద్దతుదారుల పేర్లు పొరపాటున ఈ 44 లక్షల జాబితాలో చేరాయేమోనని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో పాటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల వేళ ఈ ఓట్ల వ్యత్యాసం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది.