ఈ భారీ ఓట్ల గల్లంతులో.. 15.22 లక్షల మంది మరణించిన వారు, 22.99 లక్షల మంది శాశ్వతంగా నివాసం మారినవారు లేదా ఫారమ్‌లు సమర్పించని కేటగిరీలో ఉన్నారు. మరో 7.37 లక్షల ఓట్లను ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లుగా అధికారులు వర్గీకరించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2.91 లక్షల ఓట్లు, తిరుపతి జిల్లాలో 2.88 లక్షలు, కర్నూలులో 2.74 లక్షలు, అనంతపురంలో 2.48 లక్షలు, వైఎస్సార్ కడపలో 2.45 లక్షలు, విశాఖపట్నంలో 2.39 లక్షల ఓట్లు తొలగింపు లిస్టులోకి వెళ్లాయి.