loader

దేశంలో అడ్డదిడ్డంగా నిర్మాణాలు.. ప్రకృతికి కోపం వస్తే ఇంతేనేమో

చైనాలోని నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, బురద ప్రవాహాలు భారీ విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా… వరద పోటెత్తుతుంది. ముఖ్యంగా యాన్ , మీషాన్ నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ మీడియా ప్రకారం ఒక గ్రామం మొత్తం వరద ప్రవాహంతో దెబ్బతింది. గ్రామంలో డజన్ల కొద్దీ ఇళ్ళు కూలిపోయాయి. చాలా మంది వరద నీటిలో కొట్టుకుని పోయారు.. ఇప్పటికీ వారి జాడ […]

ఏపీ లో పెట్టుబడికి ఎవర్సెండై కార్పొరేషన్

మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ బెర్హాద్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్ ఏ. కె. నాథన్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ను విశాఖ లేదా కృష్ణపట్నం లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎవర్సెండై చైర్మన్ వివరించారు.

లైవ్‌ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్‌

పాకిస్థాన్‌లోని రావల్పిండిలో చోటు చేసుకుంది. చేతిలో మైక్రోఫోన్ పట్టుకుని.. మెడ లోతు నీటిలో నిలబడి.. ఆ రిపోర్టర్ లైవ్ కవరేజ్ అందిస్తుండగా, నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. అల్ అరేబియా ఇంగ్లీష్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో కేవలం తల, చేయి మాత్రమే కనిపించేలా ఓ జర్నలిస్ట్‌ వరదలో దిగి లైవ్‌ రిపోర్టింగ్‌ అందిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇది ధైర్యవంతమైన జర్నలిజమా లేకా రేటింగ్‌ల కోసం నిర్లక్ష్యంగా అతిగా వ్యవహరించడమా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

చుట్టుముట్టి కత్తితో చేయి నరికేసి..ఆస్ట్రేలియాలో భారతీయుడిపై

ఆస్ట్రేలియాలో 33 సంవత్సరాల భారతీయ సంతతి వ్యక్తి సౌరభ్ ఆనంద్‌పై దుండగులు దాడి జరిపారు. ఈ ఘటనలో ఆయన చేయి పూర్తిగా తెగిపోయింది. చికిత్స జరిపిన వైద్యులు దీనిని అతికించారు. గతవారం సౌరభ్‌పై దాడి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ మెడికల్ షాప్ నుంచి ఇంటికి వెళ్లుతున్న ఆనంద్‌ను దుండగులు అటకాయించారు. తమ చేతుల్లో ఉన్న పొడవాటి కత్తితో దాడికి దిగారు.ఈ క్రమంలో ఆయన చేయి తెగిందని వెల్లడైంది.

భారతీయులకు అమెరికా పౌరసత్వం మరింత కష్టతరం..

ప్రస్తుతం ఉన్న అమెరికా పౌరసత్వ పరీక్ష చాలా తేలికగా ఉందని, ట్రంప్ తొలి పాలన సమయంలో, 2020లో ఈ పౌరసత్వ పరీక్షను తాత్కాలికంగా కఠినతరం చేశారు. ఆ సమయంలో 128 ప్రశ్నల జాబితా ఉండేది. అభ్యర్థులకు 20 ప్రశ్నలు అడిగేవారు. పాస్ కావాలంటే కనీసం 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. అయితే, ఆ కఠిన రూపాన్ని తర్వాత తొలగించారు. ఇప్పుడు ట్రంప్ పరిపాలన మళ్లీ ఆ 2020 విధానాన్నే తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తోంది.

డ్రగ్స్ కేసులో విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్‌ అరెస్ట్?!

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. తండ్రి విల్ స్మిత్‌తో కలిసి ‘ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’, జాకీ ఛాన్‌తో కలిసి ‘ది కరాటే కిడ్’ వంటి సినిమాల్లో నటించిన జాడెన్, ప్రస్తుతం పారిస్‌లో ఉన్న జాడెన్ స్మిత్, నగర వీధుల్లో వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. జాడెన్ స్మిత్ డ్రగ్స్ మత్తులో ఉండడం వల్లే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.. మరికొందరైతే జాడెన్ స్మిత్, డ్రగ్స్‌తో పోలీసులకు […]

సింగపూర్‌లో భారత హైకమీషనర్‌తో చంద్రబాబు భేటీ

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారత హైకమీషనర్‌ శిల్పక్‌ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి […]

ఈయూలో అక్టోబర్‌ నుంచి రాజకీయ ప్రకటనలు బంద్‌.. ప్రకటించిన మెటా కంపెనీ

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృతసంస్థ మెటా అక్టోబర్‌ నుంచి యూరోపియన్‌ యూనియన్‌ (EU)లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచారాలలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో  కొత్తగా అమలు చేయనున్న ఈయూ నియమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ వెల్లడించింది. ఈ నియమాలు తమ ప్రక్రియ, వ్యవస్థలపై చాలా అదనపు బాధ్యతలను విధిస్తున్నాయని, ఇది ప్రకటనదారులు, ప్లాట్‌ఫారమ్‌లు ఈయూలో పనిచేయడం చట్టబద్ధంగా చాలా క్లిష్టంగా మారుతుందని కంపెనీ పేర్కొంది.

టిక్ టాక్‌కు ట్రంప్ బిగ్ షాక్..

టిక్ టాక్‌ ఇతర దేశాల్లో మాత్రం పనిచేస్తుంది. అమెరికాలో చాలా మంది దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు చైనా చేతుల్లోనే ఉందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ యొక్క యుఎస్ షేర్లను విక్రయించాలనే యుఎస్ ప్రతిపాదనను చైనా అంగీకరించకపోతే.. గతంలో మాదిరి టిక్‌టాక్‌ను మళ్ళీ యుఎస్‌లో నిషేధించనున్నట్లు లుట్నిక్ తెలిపారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సెప్టెంబర్ 17 వరకు టిక్‌టాక్‌కు గడువు ఇచ్చింది.

మాల్దీవులకు భారత్ రుణసాయం

మాల్దీవులకు భారతదేశం రూ 4850 కోట్ల రుణం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవుల పర్యటనకు శుక్రవారం వచ్చారు. వెసులుబాట్లతో కూడిన రుణసాయాన్ని వెలువరించారు. మాల్దీవులకు భారతదేశం చిరకాల విశ్వసనీయ స్నేహపక్షంగా నిలబడటం భారత్‌కు గర్వకారణం అని ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తెలిపారు. ఇరుదేశాల మధ్య స్పల్ప కాలిక క్లిష్టత తరువాత ప్రధాని మోడీ ఇక్కడికి రావడం ఇరుదేశాల మధ్య వెనుకటి సానుకూలత దిశలో ముందడుగు అయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON