loader

భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

చైనా ప్రభుత్వం భారత్ సరిహద్దు సమీపంలో ఒక వ్యూహాత్మక రైల్వే లైన్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం టిబెట్ ప్రాంతాన్ని షిన్జియాంగ్ ప్రావిన్సుతో అనుసంధానం చేయడం. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో కొంత భాగం వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంటుందని తెలుస్తోంది ఈ భారీ రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా ప్రభుత్వం ‘షిన్జియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేసింది. దీని కోసం చైనా రూ.1.15 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించిందని వార్తలు […]

అంతర్జాతీయ యువజన దినోత్సవం

అంతర్జాతీయ యువజన దినోత్సవం…. యువత గళాన్ని వినిపించేలా, వారి ఆలోచనలు ప్రతిబింబించేలా వారికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ  ఆగస్టు 12ని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రతిపాదించింది. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 12న అంతర్జాతీయ యువజోనత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, సమాజానికి ఎంతో కీలకమైన యువత పాత్రను గుర్తించి తెలియజేస్తూ, యూత్ డే ను గొప్పగా జరుపుకుంటారు.

అంతర్జాతీయ యువజన దినోత్సవం

అంతర్జాతీయ యువజన దినోత్సవం…. యువత గళాన్ని వినిపించేలా, వారి ఆలోచనలు ప్రతిబింబించేలా వారికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 17, 1999న ఆగస్టు 12ని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రతిపాదించింది. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 12న అంతర్జాతీయ యువజోనత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, సమాజానికి ఎంతో కీలకమైన యువత పాత్రను గుర్తించి తెలియజేస్తూ, యూత్ డే ను […]

మహిళల వరల్డ్ కప్ కౌంట్‌డౌన్ స్టార్ట్..

ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలో భాగంగా ఐసీసీ ట్రోఫీ టూర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ట్రోఫీ ముంబై నుంచి మొదలై, టోర్నమెంట్ హోస్ట్ నగరాలన్నింటినీ సందర్శిస్తుంది. ఢిల్లీతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లో అభిమానులకు ట్రోఫీని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.

ప్రెస్‌ టెంట్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. ఐదుగురు ఆల్‌ జజీరా జర్నలిస్ట్‌లు మృతి

హమాస్‌ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఆల్‌ జజీరా కు చెందిన ఐదుగురు జర్నలిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. అల్‌-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆస్పత్రి బయట ఉన్న ప్రెస్‌ టెంట్‌ ధ్వంసమైంది. అందులో ఉన్న ఐదుగురు జర్నిలస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ కూడా ధృవీకరించింది.

భారత్‌ను అణుబాంబుతో హెచ్చరించిన పాక్‌ ఆర్మీ చీఫ్

పాక్‌ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి భారత్‌ కు అణుబాంబు బెదిరింపులు చేశారు. భారత్‌ నుంచి పాకిస్థాన్‌ ఉనికికి ముప్పు ఉందని భావిస్తే.. అణుబాంబు సగం ప్రపంచాన్ని ముంచివేస్తుందని హెచ్చరించారు. పాక్‌ సైన్యాధిపతిగా అసిఫ్‌ మునీర్ అమెరికా గడ్డ నుంచి భారత్‌కు అణు బెదిరింపు చేయడం ఇదే మొదటిసారి. తమ దేశం ఉనికి పోతున్నట్లు భావిస్తే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తామని పేర్కొన్నారు

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..

ఎప్పుడూ స్టేటస్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు పెట్టే వారికి వాట్సాప్ వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇకపై ఫోటోలు ఎడిట్ చేయడానికి లేదా థర్డ్ పార్టీ యాప్స్ తో అవసరం లేకుండా చేసింది. యాప్‌లోనే కొలేజ్ రూపొందించుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, స్టేటస్ అప్‌డేట్ చేయడం మరింత ఈజీగా మారింది. అంటే పుట్టినరోజు పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ట్రిప్ లేదా ఏదైనా ప్రత్యేక ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ ఒకే స్టేటస్‌లో చూపించుకోవచ్చు.

ట్రంప్ భేటీ.. యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందా..!

ఆగస్టు 15న అలస్కాలో పుతిన్‌తో భేటి అయి పలు విషయాలపై చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. దాంతో, ఇరువురి మధ్య జరుగబోయే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్, పుతిన్‌ల భేటీని భారత్ స్వాగతించింది. అని ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంపై స్పష్టత రానుందని ఇండియా భావిస్తోంది.

జపాన్‌ని చూసి భయంతో వణికిపోతున్న చైనా..

జపాన్‌ను చూసి చైనా భయపడుతోందా అంటే? దౌత్య నిపుణులు అవుననే అంటున్నారు. జపాన్ కొత్త వైమానిక శక్తి చైనాలో ఆందోళనను పెంచింది. వాస్తవానికి జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం (JASDF) మియాజాకి ప్రావిన్స్‌లోని న్యూతబారు ఎయిర్‌బేస్‌లో కొత్త F-35B స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించింది. జపాన్‌లో F-35B ఫైటర్ జెట్‌ల మోహరింపును చైనా శాంతికి ముప్పుగా అభివర్ణించింది. ఇది జపాన్ విస్తారమైన పసిఫిక్ ప్రాంతంలో, అంతకు మించి దాడి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

న్యూయార్క్‌ నగరంలో కాల్పుల కలకలం

అమెరికా న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పుల కలకలం రేపాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 1:20 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. రద్దీగా టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు జరగడంతో అక్కడున్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON