హమాస్ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఆల్ జజీరా కు చెందిన ఐదుగురు జర్నలిస్ట్లు ప్రాణాలు కోల్పోయారు.
అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆస్పత్రి బయట ఉన్న ప్రెస్ టెంట్ ధ్వంసమైంది. అందులో ఉన్న ఐదుగురు జర్నిలస్ట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది.

