అంతర్జాతీయ యువజన దినోత్సవం…. యువత గళాన్ని వినిపించేలా, వారి ఆలోచనలు ప్రతిబింబించేలా వారికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్
అసెంబ్లీ డిసెంబర్ 17, 1999న ఆగస్టు 12ని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రతిపాదించింది. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 12న అంతర్జాతీయ యువజోనత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, సమాజానికి ఎంతో కీలకమైన యువత పాత్రను గుర్తించి తెలియజేస్తూ, యూత్ డే ను గొప్పగా జరుపుకుంటారు.

