loader

భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు సిద్ధం.. ట్రంప్ ట్వీటుకు మోడీ ఓకె

భారత్-అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బంధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించిన స్పందన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీలకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు జరుగుతున్నాయని ట్రంప్ వెలువరించిన వ్యాఖ్యలకు స్పందనగా మోడీ ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించారు.

ఆ విషయంలో ఎక్కడివరకైనా వెళ్తాం.. పాక్‌, స్విట్జర్లాండ్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌..!

జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 60వ సెషన్ 5వ సమావేశంలో పాకిస్తాన్‌, సింగపూర్‌ దేశాలకు భారత్‌ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని.. ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన, సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని భారత దౌత్యవేత్త క్షితిజ్‌ త్యాగి స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌ ప్రకటనపై స్పందిస్తూ.. తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి బదులుగా తన దేశం(స్విట్జర్లాండ్‌)లోని సమస్యలైన జాత్యహంకారం, వివక్ష, విదేశీయులపై ద్వేషం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని’ […]

తాత్కాలిక ప్ర‌భుత్వ చీఫ్‌గా సుశీలా క‌ర్కి పేరును ప్ర‌తిపాదించిన జెన్‌-జెడ్‌

తాత్కాలిక ప్రధానమంత్రి గురించి నేపాల్ నుండి కీలక అప్‌డేట్ వచ్చింది. సుశీలా కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి కావచ్చని తెలుస్తోంది. సుశీలా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. జనరల్-జెడ్ వర్చువల్ సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం కుదిరింది. సమాచారం ప్రకారం, దాదాపు 5000 మంది వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమయంలో, జనరల్-జెడ్ సుశీలా కర్కి పేరును ప్రతిపాదించారు. సుశీల నేపాల్ మొదటి మహిళా న్యాయమూర్తి.

ఫ్రాన్స్‌లో ‘బ్లాక్‌ ఎవ్రీథింగ్‌’ నిరసనలు.. వాహనాలకు నిప్పు.. 200 మంది అరెస్ట్‌

రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఫ్రాన్స్‌లో తాజాగా నిరసనలు చెలరేగాయి. ఫ్రాన్స్‌ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్‌ ప్రతిపాదనలను వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. బ్లాక్‌ ఎవ్రీథింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. పారిస్‌ సహా ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ నగరమైన రెన్నెస్‌లో నిరసనకారులు  ఓ బస్సును తగలబెట్టారు. రంగంలోకి దిగిన అధికారులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

అత్యంత ప‌లుచ‌ని డిజైన్‌తో స్లిమ్ ఐఫోన్ మోడ‌ల్‌ను లాంచ్ చేసిన యాపిల్‌..

టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తాజాగా నిర్వ‌హించిన త‌న ఈవెంట్‌లో ఐఫోన్ 17 ఫోన్‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఇదే ఈవెంట్‌లో ఐఫోన్ ఎయిర్ పేరిట మ‌రో ఐఫోన్ మోడ‌ల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది యాపిల్‌కు చెందిన ఎయిర్ సిరీస్‌లో వ‌చ్చిన మొద‌టి ఐఫోన్ కావ‌డం మాత్ర‌మే కాకుండా, అత్యంత ప‌లుచ‌ని ఐఫోన్ కావ‌డం కూడా విశేషం. చాలా స్లిమ్ డిజైన్‌తో లాంచ్ చేశారు. కేవ‌లం 5.6ఎంఎం మందాన్ని మాత్ర‌మే క‌లిగి ఉంటుంది.

నేపాల్..హింసకు ముగింపు పలకాలని యువతను కోరిన మోడీ..!

నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చూస్తుంటే తన మనసు చివుక్కుమంటోందని ఆయన అన్నారు. నేపాల్‌లో సుస్థిరత, శాంతి, సంపద.. వంటివి భారత్ ప్రథమ ప్రాధాన్యాలు. ఆ దేశంలోని సోదరులు, సోదరీమణులు.. అందరిని శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోడీ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.

దోహాలో హమాస్‌ నేతలు లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు.. బాధ్యత వహించిన ఇజ్రాయెల్‌ పీఎం

ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వైమానిక దళం మంగళవారం దాడులు జరిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడికి బాధ్యత వహించింది. హమాస్ అగ్రశ్రేణి ఉగ్రవాద నాయకులపై నేటి చర్య పూర్తిగా స్వతంత్ర ఆపరేషన్‌ అని.. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించి.. నిర్వహించిందని.. దీనికి ఇజ్రాయెల్‌ పూర్తి బాధ్యత వహిస్తుందని పీఎం కార్యాలయం పేర్కొంది.

కొంప ముంచిన సోషల్ మీడియా బ్యాన్

ేపాల్‌లో యువత ఇటీవల చేపట్టిన నిరసనలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అవినీతి కేసులను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది. ఖాట్మండూ వీధుల్లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం, పార్లమెంట్‌ భవనం వద్దకు చేరుకుని ఆస్తులను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను నిప్పంటించి, భవనంపై దాడులు జరిపారు. ప్రధాని ఓలీ స్వస్థలమైన దమక్ సహా కోశీ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో […]

సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా

సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు. గత వారం నుంచి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలు విధించడంతో యువతలో కోపం కట్టలు తెంచుకుంది. దీనికి ప్రతిగా జరిగిన ప్రదర్శనలు ఖాఠ్మాండు, లాలిత్‌పూర్‌లో హింసాత్మకంగా మారాయి. పోలీసులు, సైన్యం చేతిలో 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

నేపాల్లో రాజకీయ సంక్షోభం..దుబాయ్ పారిపోతున్న ప్రధాని ఓలీ?

నేపాల్లో రాజకీయ సంక్షోభం ఉద్ధృతమవుతున్న వేళ, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ దుబాయ్‌కు వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దేశంలో రెండో రోజూ ఆందోళనలు ముదురుతున్న నేపథ్యంలో, ఓలీ విమానాన్ని సిద్ధం చేసుకుని, రాజకీయ అనిశ్చితి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆగ్రహం, విపక్షాల నిరసనల మధ్య నేపాల్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. దీంతో ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON