ేపాల్‌లో యువత ఇటీవల చేపట్టిన నిరసనలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అవినీతి కేసులను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది. ఖాట్మండూ వీధుల్లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం, పార్లమెంట్ భవనం వద్దకు చేరుకుని ఆస్తులను ధ్వంసం చేశారు. ఫర్నీచర్‌ను నిప్పంటించి, భవనంపై దాడులు జరిపారు. ప్రధాని ఓలీ స్వస్థలమైన దమక్ సహా కోశీ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంది.

