loader

నోబెల్‌ గ్రహీత నర్గెస్‌ మొహమ్మది అరెస్ట్‌- విడుదల చేయాలని కమిటీ డిమాండ్

నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్‌ పోలీసులు అరెస్టు చేయడంపై నార్వే నోబెల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనిని క్రూరమైన అరెస్ట్గా పేర్కొంది. మొహమ్మదిని ఎక్కడో ఉందో స్పష్టం చేయాలని,భద్రతను కూడా నిర్ధారించాలని తెలిపింది. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆమెను విడుదల చేయాలని నోబెల్ కమిటీ డిమాండ్ చేసింది 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్‌లో మానవ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య భాగస్వామ్యం కోసం నిరంతరం […]

డెలివరీ కోసమా.. అయితే వీసాలివ్వం : యూఎస్‌ ఎంబసీ

అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వీసాల జారీ విషయంలోనూ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొందరు అమెరికా పౌరసత్వం పొందేందుకు టూరిస్ట్‌ వీసాతో డెలివరీ కోసం అమెరికా వెళ్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం టూరిస్ట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా […]

బల్గేరియా ప్రధాని రాజీనామా!.. జెన్‌-జీ దెబ్బకు కూలిన మరో ప్రభుత్వం

జెన్‌-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా యువత సాగించిన ఆందోళనలతో తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని రాసెన్‌ జెలియాజ్‌కోవ్‌ గురువారం ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసెన్‌ ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ వేలాదిమంది యువజనులు బుధవారం బల్గేరియా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన 2026 ముసాయిదా బడ్జెట్‌పై మండిపడిన యువత ఇది అవినీతిని కప్పిపుచ్చేందుకు తయారుచేసిన బడ్జెట్‌గా అభివర్ణిస్తూ రోడ్లపైకి వచ్చింది.

ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్.. కీలక అంశాలపై చర్చలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని వారు సమీక్షించారు. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం పెంచడానికి ఉన్న వేగాన్ని కొనసాగించడం ఎంత ముఖ్యమో వారు నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేవలం ఒక వారం గ్యాప్‌లోనే ఈ సంభాషణ జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రంగాల్లోనూ సహకారం పెరుగుతున్నందుకు మోదీ, […]

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిపై లైంగిక దాడి.. యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్..!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్‌ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై బయటతిరుగుతున్న అతడు జైలుకు వెళ్లే అవకాశముంది. ఇంతకూ అతడు ఎవరంటే.. బంగ్లాదేశ్‌ ‘ఏ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించే టోఫెల్ అహ్మద్ రైహాన్. ఈ యంగ్‌స్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దాంతో.. సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు టోఫెల్‌పై కేసు నమోదు చేసి […]

2030 నాటికి అతిపెద్ద డెవలపర్‌ కమ్యూనిటీ భారత్ : సత్యనాదెళ్ల

2030 నాటికి ప్రపంచంలో అతిపెద్ద డెవలపర్‌ కమ్యూనిటీగా భారత్​ అవతరిస్తుందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ సేవలు విస్తృతమవుతున్నాయని పేర్కొన్నారు. 2030 నాటికి దేశంలో 57.5 మిలియన్ల డెవలపర్లు ఉంటారని అంచనా వేశారు. ఏఐని ఉపయోగించి సామాజిక సమస్యల పరిష్కారాలు కనుగొనేందుకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ కంప్యూటర్​గా అజ్యూర్​ను రూపొందిస్తున్నామని అన్నారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

నోబెల్‌ బహుమతి అందుకున్న మచాడో కుమార్తె

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం  బుధవారం మధ్యాహ్నం నార్వే రాజధాని ఓస్లో (Oslo)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నోబెల్‌ బహుమతి గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో హాజరు కాలేదు. దీంతో ఈ బహుమతిని మచాడో కుమార్తె అనా కొరీనా సోసా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మచాడో ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మచాడో.. వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ‘ఈ బహుమతి వెనుజువెలా ప్రజలకు అంకితం’ అని భావోద్వేగంతో […]

అజ్ఞాతం వీడి.. నార్వేలో ప్రత్యక్షమైన నోబెల్‌ శాంతి గ్రహీత మచాడో..

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినీ మచాడో అజ్ఞాతం వీడారు. దాదాపు ఏడాది పాటూ అజ్ఞాతంలో ఉన్న ఆమె తాజాగా నార్వేలో ప్రత్యక్షమయ్యారు. నార్వేలోని ఓ హోటల్‌ వద్ద బహిరంగంగా కనిపించారు. తన మద్దతుదారులకు అభివాదం చేశారు. నిన్న నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే మచాడో అజ్ఞాతం వీడి పబ్లిక్‌లోకి వచ్చారు.

ఘోర ప్రమాదం.. రెండు భవనాలు కూలి 19 మంది మృతి

మొరాకో దేశంలోని ఫెజ్ నగరంలో విషాదం జరిగింది. అల్-ముస్తఖ్బల్ ప్రాంతంలో మధ్యరాత్రి రెండు పక్కపక్కన ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనాలు కుప్పకూలడంతో కనీసం 19 మంది మరణించారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఫెజ్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించబడ్డారు. కూలిన శిథిలాలలో మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తూ, రాత్రంతా శోధన కొనసాగించారు. మరణించినవారిలో పిల్లలు కూడా ఉన్నారని ఫెజ్ ప్రధాన మ్యాప్ వార్తా సంస్థ తెలిపింది.

ఈ ఏడాది గూగుల్​లో టూరిస్టులు వెతికిన టాప్​ ప్లేసులు ఇవే

మరికొన్నిరోజుల్లో 2025 ముగియబోతోంది. ఇయర్ ఎండింగ్ సందర్భంగా గూగుల్ తన “ఇయర్ ఇన్ సెర్చ్ 2025” పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇందులో 2025లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రాంతాలను లిస్ట్ చేసింది. ఈ జాబితాలో మహాకుంభమేళా అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత ఫిలిప్పీన్స్, జార్జియా, మారిషస్, మాల్దీవులతోపాటు దేశీయంగా కశ్మీర్, సోమనాథ్, పాండిచ్చేరి ప్రాంతాలను ఎక్కువ మంది సెర్చ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON